'ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు సిద్ధం చేయండి'
NLG: ఉగాది సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు చేసేందుకు ఎక్కడైనా చివరి దశలో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసి సిద్ధం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలో 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' సన్నాహక సమావేశం నిర్వహించారు.