వివాదంతో మనోవేదన.. రైలు కిందపడి ఆత్మహత్య

NLR: కందుకూరు మండలం విక్కిరాలపేట గ్రామానికి చెందిన 80 ఏళ్ల లక్షమ్మ సింగరాయకొండలో మంగళవారం రైలు కిందపడి మృతి చెందారు. ఇంట్లో జరిగిన వివాదంతో మనోవేదనకు గురైన ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. నిత్యం రామాలయంలో పూజలు చేసే లక్షమ్మ మృతితో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు.