ఆళ్లగడ్డలో మెగా జాబ్ మేళా

NDL: ఆళ్లగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఇవాళ మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ జాబ్ మేళాలో 10 ప్రైవేట్ కంపెనీలు పాల్గొన్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.