ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
GDWL: కేటిదొడ్డి మండల కేంద్రంలో నిర్మాణం పూర్తయిన మూడు ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. లబ్ధిదారులు సురేష్, శరణమ్మ, ఉల్లిగమ్మలకు గృహప్రవేశం చేయించి, వారికి కానుకలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని అన్నారు.