దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

GDWL: జిల్లా కేంద్రంలోని నది అగ్రహారం సమీపంలో శ్రీ అహోబిల మఠం 27వ పీఠాధిపతుల బృందావన దేవాలయం ప్రహరీ గోడ నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రఘువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.