దర్శి మండల ప్రజలకు ఎస్సై హెచ్చరిక

దర్శి మండల ప్రజలకు ఎస్సై హెచ్చరిక

ప్రకాశం: దర్శి మండలంలోని ప్రజలు శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని దర్శి ఎస్సై ఎం.మురళి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామాలలో వివిధ కారణాలతో ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ప్రజలకు ఎస్సై సూచించారు.