VIDEO: పొన్నూరులో వైభవంగా అమ్మవారికి అభిషేకం

GNTR: శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా పొన్నూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పంచామృత అభిషేకం నిర్వహించారు. 108 కేజీల పసుపుతో చేసిన అభిషేకం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా లలిత సహస్రనామ పారాయణం, సౌందర్యలహరి, శివానందలహరి పారాయణాలు జరిగాయి. ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.