అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని ఎమ్మెల్యేకు వినతి
E.G: అంగన్వాడీలకు జీతాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. అనపర్తి మండలం రామవరంలో శనివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కలిసి తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని అంగన్వాడీలు వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్‌లుగా మార్చాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.