తక్కువ ధరకు మెడిసిన్స్.. విదేశీ మహిళ ఆశ్చర్యం
భారత్‌లో ఔషధాల ధరలు చూసి ఐనెస్ ఫారియా అనే విదేశీ మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం రెండు యూరోలకే (రూ.252) కాఫ్ సిరప్, టాబ్లెట్లు లభించడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇంత తక్కువ ధరలు చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తోందన్నారు. తక్కువ ధరలకే నాణ్యమైన వైద్యం అందించడంలో భారత్ ముందుందని నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.