గ్రామపంచాయతీ కార్మికుల మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ
MBNR: ఈనెల 25వ తేదీన గార్లలో నిర్వహించబోయే గ్రామపంచాయతీ కార్మికుల మహాసభలను జయప్రదం చేద్దామని గ్రామపంచాయతీ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ గౌడ్ కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం వద్ద సభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ అఖిల భారత కోశాధికారి సాయిబాబు పాల్గొన్నారు.