రాయచోటిలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు

రాయచోటిలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు

అన్నమయ్య: రాయచోటిలో రాత్రి 11 తర్వాత ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, పత్రాలు లేని వాహనాలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి ఇప్పటివరకు 20 వాహనాలకు జరిమానాలు విధించారు. పత్రాలు తప్పనిసరిగా ఉంచుకోవాలని పోలీసులు హెచ్చరించారు. జరిమానాలు చెల్లించిన తరువాత మాత్రమే వాహనాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాత్రివేళల్లో అవసరం లేకుండా బయట తిరగవద్దని సూచించారు.