ఉపాధ్యాయుల పదోన్నతులకు లైన్ క్లియర్

ఖమ్మం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు గురువారం ఉదయం వరకు సీనియారిటీ జాబితాలో ఉన్న ఎస్ఏలు వెబ్‌ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది. జోనల్ స్థాయిలో1,300 మందికి అవకాశముండగా, ఖమ్మం జిల్లాలో 70 మంది హెచ్ఎంలుగా పదోన్నతి పొందనున్నారు.