నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు

NGKL: వట్టెం జవహర్ నవోదయ విద్యాలయం(NVS)లో 2026-27 విద్యా సంవత్సరం కోసం 6వ తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 13 వరకు పొడిగించినట్లు నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు. దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసిందని, విద్యార్థులు, తల్లిదండ్రుల సౌలభ్యం కోసం గడువు పొడిగించినట్లు తెలిపారు.