మినరల్ వాటర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

మినరల్ వాటర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

ప్రకాశం: త్రిపురాంతకంలోని మినరల్ వాటర్ ప్లాంట్‌లో బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వాటర్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. రూ.16 లక్షలు విలువ చేసే మిషనరీ కాలిపోయినట్లు ప్లాంట్ యజమాని గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.