బంధువులకు మృతదేహం అప్పగించిన పోలీసులు
JGL: రాయపట్నం బ్రిడ్జి సమీపంలో ఇటీవల లభ్యమైన గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సుల్తానాబాద్‌కు చెందిన అట్టపల్లి రాజేంద్రప్రసాద్(39)గా బంధువులు గుర్తించారు. పోలీసుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ధర్మపురి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని గుర్తింపు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లే ఎస్సై మహేష్ తెలిపారు.