గండికోటలో చిరుతల సంచారం
KDP: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోటలో మేకల మందపై చిరుతలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన గురుప్రసాద్, లక్ష్మీదేవి దంపతుల మేకల గుంపుపై నాలుగు చిరుతలు దాడి చేశాయి. దాడిలో రెండు మేకలు మృతి చెంది, మరో రెండు గాయపడినట్లు కాపరి తెలిపాడు. విషయం తెలుసుకున్న అటవీ రేంజర్ శ్రీనివాసు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, చిరుతల సంచారంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని పెర్కొన్నారు.