అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా వాసి ఎంపిక

MLG: వెంకటాపురం మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన మోడెమ్ వంశీ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఆగస్టు నేటి నుంచి సెప్టెంబర్ 5 వరకు కోస్టారికాలో జరిగే ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మన దేశం తరపున పాల్గొననున్నారు. గతంలో సాధించిన విజయాల ఆధారంగా పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా పోటీలకు వంశీని ఎంపిక చేసింది. ఈ సందర్భంగా మండల ప్రజలు వంశీని అభినందించారు.