సీఎం జగన్ పై దాడి పిరికిపందల చర్య

సీఎం జగన్ పై దాడి పిరికిపందల చర్య

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ పై దాడి పిరికిపందల చర్యని పెదకూరపాడు శాసనసభ్యుడు నంబూరు శంకర్రావు చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో జగన్ కు వస్తున్న ఆదరణ, ఆప్యాయత ఓర్చుకోలేక ప్రతిపక్షాలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయన్నారు. జగన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.