తిరుమల శ్రీవారి సేవలో నాగచైతన్య దంపతులు

తిరుమల శ్రీవారి సేవలో నాగచైతన్య దంపతులు

తిరుమల శ్రీవారిని అక్కినేని నాగచైతన్య, శోభిత దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ VIP బ్రేక్ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. TTD అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో చైతన్య దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.