మత్స్యకారులకు నిత్యవసర సరుకులు పంపిణీ
AKP: ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం గ్రామంలో వరద బాధితులైన మత్స్యకారులకు శనివారం ఉదయం నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారి కె. వెంకటరమణ ఆధ్వర్యంలో బియ్యం, చింతపండు, నూనె, కందిపప్పు, ఉల్లిపాయలు తదితర నిత్యవసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు కోడ లోవరాజు కూటమి నాయకులు పాల్గొన్నారు.