నాయుడుపేటలో 29న టిడ్కో రుణ మేళా

నాయుడుపేటలో 29న టిడ్కో రుణ మేళా

TPT: నాయుడుపేట బోయివాడలోని PMAY–ఎన్టీఆర్ నగర్ టిడ్కో ఇళ్లను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకులోన్ పొందని లబ్ధిదారుల కోసం 29న ఉదయం 10 గంటలకు RTC బస్టాండ్ పక్కన ఉన్న అంబేడ్కర్ భవనంలో రుణ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్,PAN,బ్యాంక్ పాస్బుక్, 2 ఫొటోలు, అలాట్మెంట్ లెటర్,సేల్ అగ్రిమెంట్ తీసుకురావాలన్నారు.