శిక్షణలో అన్యాయం జరగకుండా చూడాలని వినతి
NLG: త్రిపురారం మండలంలో దివ్యాంగులకు SBI రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఇన్స్టిట్యూట్‌లో శిక్షణ ఇస్తున్నారు. అయితే, మండలంలోని దివ్యాంగులకు కాకుండా ఇతర మండలాల వారికి శిక్షణ ఇస్తుండడంతో స్థానికులకు అన్యాయం జరుగుతోందని అన్ ఎంప్లాయ్ డిజేబుల్ యూత్ ఆప్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బూర నాగయ్య గౌడ్ ఆరోపిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.