అక్రమంగా భారీ వృక్షాల నరికివేత.. గ్రామస్థుల ఆందోళన
NLR: వరికుంటపాడు మండలం విరువూరు రెవెన్యూ ప్రాంతంలో భారీ వృక్షాలను అక్రమంగా నరికివేయడంపై స్థానికులు తీవ్రంగా అగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ పరిసరాల్లో వేప, తుమ్మ చెట్లను కొట్టివేసి అక్రమంగా రవాణా చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు స్పందించి సహజ సంపద దోపిడీపై విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.