గ్రంథాలయంలో క్విజ్ పోటీలు
VZM: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కొత్తవలస శాఖ గ్రంథాలయంలో బుధవారం క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు 30 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాద్యాయులు పాఠ్యాంశాల మీద ప్రశ్నలను అడిగారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, గ్రంథాలయ అధికారిణి రామలక్ష్మి పాల్గొన్నారు.