వనపర్తి వాసికి ఇండియన్ స్కూల్ అవార్డు

WNP: గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు డా.ధర్మరాజు గోపాల్ పేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్. బుధవారం హైదరాబాదులోని అశోక్ కన్వెన్షన్ సెంటర్లో ఇండియన్ స్కూల్ అవార్డు కార్యక్రమంలో ధర్మరాజుకు విద్యా రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు అవార్డు ప్రధానం చేశారు. దీంతో పలువురు జిల్లా వాసులు ఆయనకు అభినందనలు తెలిపారు.