విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థులకు పాఠాలు బోధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బుధవారం బెల్లంపల్లిలోని KGBVని సందర్శించిన ఆయన, స్వయంగా బోర్డుపై పాఠాలు రాస్తూ విద్యార్థులకు పలు అంశాలను వివరించారు. వారితో ముచ్చటించి ప్రశ్నలు అడిగి ఉత్సాహపరిచారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.