చిలకలూరిపేట కోర్టుకు ప్రత్తిపాటి పుల్లారావు

PLD: వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ధర్నా చేసిన కేసు విచారణలో భాగంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శనివారం చిలకలూరిపేట కోర్టుకు హాజరయ్యారు. గత ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.