'అభివృద్ధి అంచనాలను పక్కాగా రూపొందించాలి'
VSP: బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ విభాగాల అధికారులతో రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు సమావేశమయ్యారు. అభివృద్ధి పనులు చేపట్టే క్రమంలో అంచనాలను పక్కాగా రూపొందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను సక్రమంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు.