పిచ్చికుక్కల దాడి..15 మందికి గాయాలు

అనంతపురం: పుట్లూరులో పిచ్చికుక్క స్థానికులను భయాందోళనకు గురిచేసింది. నిన్న రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో పిచ్చికుక్క దాడి చేయడంతో దాదాపు 15 మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారందరినీ తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడిలో దేవాన్స్ అనే చిన్నారి త్రీవంగా గాయపడ్డాడు.