హర్మూజ్ జలసంధి సమీపంలో భారీ పేలుళ్లు
ఇరాన్‌లోని వ్యూహాత్మకమైన బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుళ్లు సంభవించాయి. హర్మూజ్ జలసంధికి అత్యంత సమీపంలో ఉన్న IRGC నేవీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడి ధాటికి పోర్టు పరిసర ప్రాంతాలన్నీ భారీ శబ్దాలతో దద్దరిల్లాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.