పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: మంత్రి

పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: మంత్రి

నంద్యాల జిల్లా ప్రజలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని విఘ్నేశ్వరుడుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వాడ వాడల వెలిసే గణేష్ మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు.