ఎనుమాముల మార్కెట్‌లో పల్లికాయ క్వింటా రూ.6,210
WGL: చాలా రోజుల తర్వాత వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెటుకు పల్లికాయ (వేరుశనగ) తరలివచ్చింది. ఈ క్రమంలో పచ్చి పల్లికాయ క్వింటాకు రూ. 6,210 ధర రాగా, సూక పల్లికాయ రూ.4,500 ధర పలికింది. మరోవైపు, మార్కెట్కి వచ్చిన మొక్కజొన్న (మక్కలు) ధర భారీగా తగ్గింది. సోమవారం రూ. 2,080 ఉన్న ధర, ఈ రోజు రూ. 2,030కి పడిపోయింది.