కేజీబీవీ పాఠశాల అకౌంటెంట్ మృతి
ATP: సెట్టూరు మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో విధులు నిర్వహించే అకౌంటెంట్ గీతాంజలి సోమవారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉండేదని బంధువులు తెలిపారు. గీతాంజలి మృతికి కేజీబీవీ పాఠశాల విద్యార్థులు శోకసముద్రంలో మునిగారు. గీతాంజలి భౌతికాయానికి, ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులర్పించారు.