సింగపూర్ ప్రతినిధులతో మంత్రి సమావేశం
GNTR: రాష్ట్ర సచివాలయంలో సింగపూర్ ప్రతినిధి బృందం పర్యటన సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయంలో బుధవారం కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమగ్రంగా వివరించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, సంక్షేమ పథకాల అమలు, పారదర్శక పాలన, మౌలిక సదుపాయాల విస్తరణపై విపులంగా చర్చించారు.