'పౌరుల భాగస్వామ్యంతో క్లీన్ & గ్రీన్ సిటీ'

'పౌరుల భాగస్వామ్యంతో క్లీన్ & గ్రీన్ సిటీ'

KRNL: పౌరుల భాగస్వామ్యంతోనే కర్నూలును ‘క్లీన్ అండ్ గ్రీన్’ సిటీగా తీర్చిదిద్దగలమని నగర కమిషనర్ పీ.విశ్వనాథ్ తెలిపారు. శుక్రవారం నిర్మల్ నగర్‌లో జరుగుతున్న స్వచ్చత పనులను ఆయన పరిశీలించారు. నగరంలో జంతువులు, పశువుల నుంచి ప్రజలకు అసౌకర్యం, ఆరోగ్యపరమైన ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నియంత్రణ కోసం మూడు వినూత్న కార్యక్రమాలను ప్రారంభించామని పేర్కొన్నారు.