ఇసుక రీచ్‌లను తనిఖీ చేసిన డీఎస్పీ
SRCL: వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూలవాగు ఇసుక రీచ్‌ను పట్టణ సీఐ వీరప్రసాద్‌తో కలసి డీఎస్పీ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇసుక తవ్వకాల విధానం, రవాణా అనుమతులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ విధానం ద్వారానే ఇసుక సరఫరా చేయాలని కోరారు.