చైనా మాంజ విక్రయించినా, వినియోగించినా చర్యలు: CP
NZB: సంక్రాంతి పండగ వస్తున్న తరుణంలో గాలిపటాల విక్రయ కేంద్రాల్లో చైనా మాంజాలు విక్రయించవద్దని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. చైనా మాంజా వల్ల ఎవరికైనా ప్రాణ హాని కలిగితే హత్య నేరం కింద కేసు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా పోలీస్ స్టేషన్ లేదా 100 డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.