పది మందిని గాయపరిచిన పిచ్చికుక్క

పది మందిని గాయపరిచిన పిచ్చికుక్క

AKP: బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో బుధవారం ఉదయం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. పది మందికి పైగా వ్యక్తులను గాయపరిచింది. దీంతో వీరంతా ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో కుక్కల సంచారం అధికమైందని ప్రజలు వాపోతున్నారు. తక్షణమే వీటి నియంత్రణకు చొరవ చూపాలని కోరుతున్నారు.