ఏప్రిల్ నుండి ఎలక్ట్రానిక్స్ ధరలకు రెక్కలు

ఏప్రిల్ నుండి ఎలక్ట్రానిక్స్ ధరలకు రెక్కలు

భారతదేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి. చిప్‌ల కొరత, రూపాయి విలువ తగ్గడం వల్ల స్మార్ట్‌ఫోన్లు, TVలు, ACల ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఉన్న డిస్కౌంట్లు కూడా తగ్గిపోవడంతో మధ్యతరగతి వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. దీంతో చాలామంది కొత్త వస్తువుల కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారు, లేదంటే సెకండ్ హ్యాండ్ వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు.