'సీతారాం తండాలో మంచినీటి సమస్య పరిష్కారం'
MDK: శివంపేట (M) సీతారాం తండాలో మంచినీటి సమస్య పరిష్కారానికి తాజా మాజీ జెడ్పీటిీసీ పబ్బ మహేష్ గుప్తా సొంత నిధులతో బోరు, మోటారు ఏర్పాటు చేశారు. తండావాసుల సమస్యలను గుర్తించి బోరు మోటారు ఏర్పాటు చేయడంతో సోమవారం పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వేమారెడ్డి, కుమ్మరి శంకర్, అశోక్ కుమార్, రాజేందర్ నాయక్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.