ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

MNCL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లకు ప్రస్తుతం 146.12 వరకు చేరింది. నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా 15.5041 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 13007 క్యూసెక్కుల వరద వస్తుండగా.. హెచ్ఎండబ్ల్యూఎస్‌కు 286, ఎన్టీపీసీకి 121, నంది పంపు హౌజ్‌కు 12,600 క్యూసెక్కులు విడుదల చేశారు.