బీజేపీ పార్టీలో చేరేది లేదు: మాజీ ఎమ్మెల్యే

వరంగల్: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శనివారం స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా తనపై వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నట్లు తెలిపారు. కావాలనే కొందరు కుట్ర పన్ని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ పార్టీలో చేరేది లేదని తేల్చి చెప్పారు.