VIDEO: కలెక్టరేట్‌లో కాంట్రాక్టర్ పై అధికారి దాడి
BHPL: జిల్లా కలెక్టరేట్‌లో APAO ఫణిభూషణ కశ్యప్ రెచ్చిపోయారు. బిల్లులు చెల్లించాలని అడిగినందుకు కాంట్రాక్టర్ వీరేందర్‌పై బూతు పురాణంతో టేబుల్‌పై ఉన్న వస్తువులు విసురుతూ దాడి చేశారు. దీంతో కాంట్రాక్టర్ మొహంపై గాయాలయ్యాయి. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అధికారిపై కేసు నమోదయింది. బాధితుడు గతంలో APAOపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసాడు.