ఉమ్మడి జిల్లాలో ఎండల ఉష్టోగ్రత ఎంతంటే..?
KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా గుల్లకోటలో 44.4°C, కోరుట్లలో 44.2°C నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల (ఐడీఓసీ) 44.3, ఎల్లారెడ్డిపేట 44.1°C నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా తనుగుల, వీణవంకలో 43.6 చొప్పున నమోదు కాగా, పెద్దపల్లి జిల్లా ఏక్లాస్పూర్, ఆకెనపల్లిలో 43.9 చొప్పున నమోదైంది.