హత్య చేసిన ఆరుగురు నిందితులు అరెస్ట్

హత్య చేసిన ఆరుగురు నిందితులు అరెస్ట్

NLR: జలదంకి మండలం, గట్టుపల్లి చింతలపాలెంలో TDP నాయకుడు ప్రసాద్‌ను కొందరు హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, 6 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు DSP శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాకు చెందిన సదాశివరావు, వెంకట నరసింహారావు మధ్య జరిగిన భూ వివాదం ఈ హత్యకు కారణమన్నారు. కృష్ణా, బాపట్ల జిల్లాలకు చెందిన కొందరు సుపారీ తీసుకొని ఈ హత్య చేసినట్లు పేర్కొన్నారు.