'జాబ్ మేళాకు భారీ స్పందన'
TPT: వెంకటగిరిలో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్నారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణతో పాటు ప్రతి మూడు నెలలకు జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు.