బొగ్గుల పొయ్యి వాడుకోండి : కేంద్రం
గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించుకోవాలని ప్రజలకు కేంద్రం సూచించింది. సిలిండర్లపై ఆధారపడటాన్ని తగ్గించి, వీలైనంత వరకు PNG కనెక్షన్లను తీసుకోవాలని కోరింది. అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో కిరోసిన్, బొగ్గు పోయ్యిలను కూడా వినియోగించుకోవాలని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలకు తగినంత బొగ్గు నిల్వలను సరఫరా చేయాలని సింగరేణి సంస్థలను ఆదేశించింది.