'ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం'

KRNL: ముఖ్యమంత్రి సహాయనిధి పేదల వైద్యానికి భరోసానిస్తుందని ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు. బుధవారం ఆదోనిలో మీనాక్షి నాయుడు చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 32 మందికి మంజూరైన రూ.15 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.