పాక్‌లోకి 14 మంది హిందువులకు ఎంట్రీ నిరాకరణ

పాక్‌లోకి 14 మంది హిందువులకు ఎంట్రీ నిరాకరణ

14 మంది భారతీయులను తమ దేశంలోకి రాకుండా పాక్ అధికారులు అడ్డుకున్నారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ 556వ జయంతి సందర్భంగా ఆయన జన్మస్థలమైన పాక్‌లోని నంకనా సాహిబ్‌కు వీరంతా వెళ్తున్నారు. అయితే మొదట వీరితో పాటు మొత్తం 2100 మందికి ఇస్లామాబాద్ అనుమతించింది. ఆ తర్వాత పాక్ అధికారులు.. ఈ 14 మంది సిక్కులు కాదు హిందువులు అంటూ వెనక్కి పంపించారు.