జంతు జనన నియంత్రణ కేంద్రం ప్రారంభం

కరీంనగర్: హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లిలో పశు వైద్యశాల ఆవరణలో జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ గందే రాధిక ప్రారంభించారు. వీధి కుక్కల బెడద అధికంగా ఉన్నందున వాటిని నియంత్రించుటకు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ సమ్మయ్య, కార్యాలయ భూపాల్ రెడ్డి, పురపాలక సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.